నా మెయిలు లో తెలుగు వెలిగిపోతుంటేను... తెలుగు వెలుగు లు దిగంతాలు దాటేను ... నా కలలు నిక్కముగ చూసుకుంటున్నా... తెలుగు తల్లి పదముల మొక్కి, బాసలు చేసుకుంటున్నా.. తెలుగు లో ఈ మెయిలు వ్రాసుకుంటున్నా.... లాలి పాటల తెలుగు పొలము పాటల తెలుగు చదువు సంధ్యల తెలుగు శౌర్య చేతన తెలుగు మదికి సాంత్వన తెలుగు మధుర లాలన తెలుగు మరులు గొల్పెడు తెలుగు మమత తెలుగు రత్నాలు పొదిగిన తెలుగు రాచ తెలుగు కృష్ణ రాయల కీర్తి గాంచె తెలుగు రవి చెందురుల ఆయువున్న తెలుగు కవి త్రయము కూర్చిన భారతము తెలుగు అన్నమాచార్యుని పదము తెలుగు త్యాగరాయుని కృతుల సిరులు తెలుగు పోతన్న భాగవతము కాంచిన వెలుగు శ్రీనాధ ప్రబంధముల మెరిసె జిలుగు కీర్తించ లేనంత వరము తెలుగు మాటే తానైన...