Skip to main content

గుండె సవ్వడి

గుండె సవ్వడి! 

ఇది తెలుగు వారి గుండె సవ్వడి! 

మన తెలుగు వారి మనసుల్లో ఆలోచనలు కూడా తెలుగులోనే ఉంటాయి కదండీ! అందుకే మనందరి మనసులకు అద్దం పట్టేలా ఈ తెలుగు బ్లాగ్ మొదలుపెట్టాను. 

నా పేరు కుంచాల. వంశీ కృష్ణ. వృత్తిపరంగా నేనొక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రవృత్తిపరంగా నేనొక తెలుగు వాడిని. సంస్కృతి, సాంకేతికతల మేలి కలయిక మన సంస్కృతి విలువను మరింత పెంచుతుందని నా నమ్మకం. తెలుగును జగద్విఖ్యాతం చెయ్యటంలో సాంకేతికత సముచిత పాత్ర పోషించిందనటం నిర్వివాదం. హైటెక్ సిటీ నుండి ప్రపంచ కోణ కోణాలకు తెలుగు విస్తరించి ఉందంటే అతిశయోక్తి కాదేమో!

నాకు మన తెలుగు భాష అన్నా, మన సంస్కృతి అన్నా ఎనలేని మక్కువ. తెలుగు లో మాట్లాడే ప్రతి పదం మనసుకు ఇంపుగా ఉంటుంది నాకు. ఇది చదువుతున్నారు అంటే మీకు కూడా అలాగే ఉంటుంది అని భావిస్తున్నాను.

తెలుగదేలయన్న తెలుగొకండ అన్నారు శ్రీ కృష్ణ దేవరాయలు.

మన తెలుగు చరిత్ర పైన, తెలుగు ఆచార వ్యవహారాల పైన, సనాతన సంస్కృతి పైన: తర్కబద్ధమైన, సకారాత్మకమైన, ఉత్తేజభరితమైన, ఉల్లాసభరితమైన వివరాలు సేకరించి పొందుపరచటం ఈ బ్లాగ్ లక్ష్యాలలో ఒకటి. మన ముందు తరాల వారికి ఇది ఒక వారసత్వ సంపద కావాలని నా ఆకాంక్ష. 

మరో ముఖ్యమైన లక్ష్యం సమకాలీన పరిస్థితుల్లో మనకు ఎదురవుతున్న రకరకాల సమస్యల పైన లోతైన విశ్లేషణ, విభిన్న దృక్కోణం, వినూత్న పరిష్కారాలు అందించే ప్రయత్నం. నాకు అన్నీ తెలుసు అని కోతలు కొయ్యను కానీ, విభిన్నమైన నా ఆలోచనాశైలి మీ మనోఫలకం పైన ఒక చెదిరిపోని సంతృప్తికరమైన ముద్ర వేయగలదని నా నమ్మకం.

మీకు నచ్చిన విషయాలు మీ స్నేహితులు, బంధువులతో పంచుకునే అవకాశం ఉండేలా ఈ బ్లాగ్ లో ప్రతి అంశం సరళంగా ఉంచే ప్రయత్నం చేస్తాను. మీకు నచ్చిన ఏదైనా విషయాల పైన వ్రాయమని అడిగితే వ్రాస్తాను. మీ సూచనను కామెంట్స్ లో తెలియజేస్తే నేను మీకు సమాధానం వీలున్నంత త్వరగా ఇస్తాను.

నాకు తెలుగు, ఇంగ్లీషు అర్ధం అవుతాయి. కనుక మీకు తెలుగులో వ్రాయటం ఇబ్బంది ఉంటే ఇంగ్లీషులో అయినా మీ అభిప్రాయం వ్యక్తం చెయ్యగలరు. 

Comments

Popular posts from this blog

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః | యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః॥ - మను స్మృతి అధ్యాయం 3, శ్లోకం 56 మెదటి చరణం అందరికీ తెలిసిందే. ఆడవారు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. కానీ రెండో చరణం అర్థం మనుస్మృతి లో స్త్రీ కి ఉన్న గౌరవం, ప్రాముఖ్యత ఉటంకిస్తూ ఉంది. యత్రైతాస్తు న పూజ్యంతే = యత్ర + ఇతి + న + అస్తు + పూజ్యంతే = ఎక్కడ ఆమె పూజించబడదో సర్వాస్తత్రాఫలాః క్రియాః = సర్వః + తత్ర + అఫలాః + క్రియాః = అక్కడ ఏ పనీ ఫలించనట్టే. అంటే ఎక్కడ స్త్రీ గౌరవించబడదో అక్కడ ఏమున్నా, ఎంతున్నా నిష్ప్రయోజనం అని. స్త్రీ కి గౌరవం ఇవ్వండి అని చెప్పి ఊరుకోలేదు. ఆమెకు గౌరవం ఇవ్వని చోట ఇంకేమీ విలువైనది కాదు అని తర్కపూర్ణంగా ఉటంకిస్తూ చెప్పారు.  ఇది మన సంస్కృతిలో స్త్రీ యొక్క స్థానం. ముష్కర మూకలు మన మీద దాడి చెయ్యక ముందు కాలంలో స్త్రీకి అన్ని వ్యవహారాలలో అవకాశం, గౌరవం ఉండేది. స్త్రీ తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవటానికి నిర్ణయించుకున్నా, విద్య నుంచి యుద్ధం వరకు ఏ అంశంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నా సమానమైన గౌరవం ఉండేది. వేదాలు వ్రాసిన వారిలో లోపముద్ర వంటి స్త్రీ మూర్త...

🌿 ఉగాది పండగ - ఎందుకు, ఏమిటి, ఎలా?

  ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు… ఇది కొత్త ఆలోచనలకు, కొత్త ఆశలకు, కొత్త జీవనానికి ప్రారంభం. ఉగాది  - యుగాది అనే పదం నుండి వచ్చింది. “యుగాది” అంటే  “యుగం + ఆది” — అంటే కాలానికి ఆరంభం అని అర్ధం . తెలుగు ప్రజలకు ఇది నూతన సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి ఒక అవకాశం. 🌼 వసంత ఋతువు – ప్రకృతి ఉత్సవం  వసంత ఋతువు ఉగాదితో ప్రారంభమౌతుంది. ప్రకృతి కొత్త జీవితాన్ని అందుకుంటుంది. శరీరానికి, మనసుకు హాయిగా ఉంటుంది. ప్రకృతి సహజంగా జీవ శక్తిని పెంచుతుంది. మామిడి పూలు వేప పువ్వులు పచ్చని చెట్లు ఇది ప్రకృతి మనకు ఇచ్చే ఒక అవకాశం.  ఉపయోగం లేని అలవాట్లు విడిచిపెట్టి జీవితానికి సహకరించే అలవాటులను, అవకాశాలను ఆహ్వానించాలి. 🌸 ఉగాది యొక్క ప్రాముఖ్యత చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సంవత్సర ఆరంభమౌతుందని పంచాంగ శాస్త్రం చెబుతుంది. పురాణాలలో సృష్టి ఆరంభం వసంతంతో మొదలౌతుంది అని చెప్పబడింది. ఆ వసంతం చైత్రమాసం తో మొదలౌతుంది. చైత్రమాసం లో మొదటి రోజునే ‘యుగాది’గా భావించడం సాంప్రదాయంగా ఏర్పడింది.   బ్రహ్మ దేవుడు  ఈ రోజే సృష్టిని ప్రారంభించాడ...