Skip to main content

స్వాతంత్ర్యం అంటే ఏమిటి?

స్వాతంత్ర్యం! అందరికీ చాలా ఇష్టమైన పదం. ఇంగ్లిష్ లో ఫ్రీడం అనే పదానికి తెలుగు అర్ధం స్వేచ్చ. ఈ రెండు పదాల అర్ధం వేరు. వాటి పర్యవసానం కూడా వేరు.

 

స్వేచ్చ అనే పదానికి అర్ధం స్వ + ఇచ్ఛ = నాకు నచ్చింది చేస్తాను. ఇందులో నిర్ణయం అనేంత ఏమీ లేదు. చాలా సాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించదగ్గ పదం.

 

స్వాతంత్ర్యం అనే పదానికి అర్దం స్వ + తంత్రం = నా నిర్ణయం నేను తీసుకునే శక్తి కలిగి ఉంటాను/ఉన్నాను అని. ఇది నిజంగా మంచిదేనా? జవాబు - అడిగిన వ్యక్తి పరిణతి పైనా, జవాబు చెప్పే వ్యక్తి బాద్యత / పరిణతి పైనా ఆధారపడుతుంది. మూడు సంవత్సరాల కుర్రవాడు నేను నాకు నచ్చిన తిండి తినటం స్వేచ్చ అంటే ఒక పూటకి ఫరవాలేదు. ప్రతి పూట అలా చేస్తే వాడి ఆరోగ్యం పాడుచేసిన వాళ్ళం అవుతాం కదా. అందుకే అప్పుడప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలి. స్వాతంత్ర్యం ఇవ్వటానికి ముందు వాళ్ళకు పరిణతి కావాలి.

 

తాను ఏ చదువు చడవాలో నిర్ణయించుకునే అవకాశం పిల్లకు ఇవ్వటం స్వాతంత్ర్యం. తన జీవితం పట్ల బాధ్యత ఉన్న విధ్యార్ధికి ఈ స్వాతంత్ర్యం ఎప్పుడూ మేలు చేస్తుంది. చాపల్యం ఇంకా పోకముందు అదే నిర్ణయం వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు హాని కలుగుతుంది.

 

పరిణతి అనేది అందరికీ ఒకే వయసులో రాదు. ప్రతి వ్యక్తికి ఈ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. అందుకే స్వాతంత్ర్యం ఇవ్వాలా లేదా అనే నిర్ణయం తల్లిదండ్రులకు వదిలిపెట్టాలి అని నా అభిప్రాయం. ఎందుకంటే మన మంచి కోరుకునే వాళ్ళలో మొదటి వరుసలో వారే ఉంటారు కనుక. వాళ్ళ జీవితం లో సింహభాగం పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తారు కనుక.

 

వారు తమ భయం చేత పిల్లల భవిష్యత్తుకి అడ్డంకి గా కూడా మారే అవకాశం లేకపోలేదు. ఐతే తల్లిదండ్రులకు ఈ విషయంలో వారి భయాలను ఎరుకలో ఉంచుకుని పిల్లల పరిణతిని నిర్ణయించే మానసిక శిక్షణ అవసరం. పిల్లలకు ఆ నిర్ణయం తీసుకునే స్వాతంత్ర్యం ఇవ్వటం మాత్రం అనివార్యం. ఎందుకంటే వారి జీవితం చివరి వరకూ మనం బ్రతకం కనుక.

 

పిల్లలకు నిర్ణయాధికారం ఎంత త్వరగా ఇవ్వగలిగితే అంత మంచిది. దీనికి రెండు కారణాలు. ఒకటి, కొన్ని తప్పటడుగులు వేసినా వారికి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. రెండు, ఏ కారణం వల్లైనా తల్లిదండ్రులు పిల్లలకు దూరమయ్యే పరిస్తితి ఏర్పడినా వారు తమ జీవితాన్ని సజావుగా నడుపుకునే సామర్ధ్యం కలిగి ఉండటం మంచిది.

 

పిల్లలకు నిర్ణయాధికారం ఇచ్చిన కొత్తలో తప్పులు చేస్తారు. ఇది వారికి నిర్ణయాధికారాన్ని ఇవ్వకుండా ఉంచే అడ్డంకి. జీవితం పెర్ఫెక్ట్ గా ఉండదు. మనం ఎంతగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఐనా కొన్నాళ్ళ తరువాత తప్పుగా తోచవచ్చు. జీవితం లో జరిగిపోయిన విషయాల గురించి ఎప్పుడూ విచారించకూడదు. ఇదివరకు జరిగిన ప్రతి సన్నివేశం గుర్తుంచుకోవటం మంచిదే. కానీ దానికి ఎమోషన్ కలిపి ఉంచకూడదు.

సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పినట్టు, మన ఆలోచనల్లో అధిక శాతం - గతం లో జరిగిపోయిన సంఘటనలకు సంబంధించి ఐనా ఉంటాయి, లేదా భవిష్యత్తుకు సంబంధించి అయినా ఉంటాయి. ప్రస్తుత పరిస్తితుల గురించి ఆలోచన కంటే అవగాహన ఎక్కువ సహకరిస్తుంది. ఈ విషయం మనకు ఇప్పటివరకు ఉన్న ఆలోచనా సరళికి పూర్తి విరుధ్ధంగా ఉండవచ్చు. అంత మాత్రాన కొట్టి పారెయ్యకండి. ఆలోచించండి. ఇది సత్యం.

 

మీరు ఆలోచించే సమయం మీ అంచనా కంటే చాలా ఎక్కువ. మన ఎరుకలో లేకుండా మనం చాలా ఆలోచిస్తాం. మనం చూసే ప్రతి విషయం, వినే ప్రతి అంశం మన ఆలోచనలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మనం ఎదురుపడే ప్రతి వ్యక్తి పైనా, వస్తువు పైనా, ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటూ పోతుంటాం. ఆ అభిప్రాయం సరైనదే అని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మన మనసు వేగం పరిసరాలను అవగాహన చేసుకుని తగినట్టు స్పందించేందుకు రూపుదిద్దుకుంది. దీనికి ఖచ్చితత్వం కంటే వేగమే ముఖ్యం. ఇది సహజ జీవన పరిస్తితుల్లో చాలా అవసరం. నేటి నాగరిక సమాజంలో ఇది చాలా చిక్కులు తెస్తుంది. ఇప్పుడు ప్రతి పని ఖచ్చితత్వంతో చెయ్యాలని మన విద్యావిధానం మనకు నేర్పించింది. మనసు మాత్రం అందుకు సరిపడేంత ఖచ్చితత్వం సంతరించుకోలేదు. దీన్ని అర్ధం చేసుకోకుండా మన నిర్ణయాలు ఖచ్చితంగా ఉండాలని ఆశించటం ఒక రకమైన అమాయకత్వం. ఈ ఎక్స్పెక్టేషన్ వల్ల ప్రతి చిన్న అలజడినీ పెద్ద కల్లోలం లా చూస్తూ మనం సఫర్ అవుతున్నాము.

యాంత్రిక యుగంలో ఖచ్చితత్వం అనివార్యం. ఇది ఫిజిక్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్. ఫిజిక్స్ లా ప్రకారం ప్రపంచంలో చాలా విషయాలు ప్రతిసారి అవే రిజల్ట్స్ ఇస్తాయి. ఇది మానసిక పరిధికి వర్తింపజేసే ప్రయత్నం చెయ్యకూడదు. మనసుకు సంబంధించినంత వరకు, నిర్ణయం ఏక్సెప్టబుల్ పరిధిలో ఉంటే చాలు. ప్రిసిషన్ అవసరం లేదు. ఎందుకు అంటే మనసు ఫిజిక్స్ కంటే చాలా సంక్లిష్టమైన టెరేన్. అందులో చాలా వేరియబుల్స్ ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే - జీవితం అంటే ఒక జాబ్, కుటుంబం, బాధ్యతలు, బంధాలు కాదు. ఇవన్నీ ఉంటే చూడ్డానికి బాగుండొచ్చు. కానీ, వాటి కోసం జీవితం కుదువపెట్టవలసి వస్తే జీవితం విలువని మనం తక్కువ గా అంచనా వేసినట్టే. టెక్నాలజీ రాక ముందు మనిషి బ్రతికాడు. కొంత కష్టపడి ఉండొచ్చు, కానీ జీవితం మొత్తం కష్టమే నిండి ఉండదు. టెక్నాలజీ లేకపోయినా మనిషి బ్రతకవచ్చు. ఇది చాలా మందికి నచ్చని వాక్యం. కానీ పూర్తిగా నిజం. ఐఫోన్ లేకపోయినా కడుపు నింపుకోవచ్చు. కాకపోతే పీర్ ప్రెషర్ వల్ల ఐఫోన్ లేకపోతే జీవితం ఫుల్ఫిల్ కానట్టు ఆలోచించటం సరైన విధానం కాదు. సంతోషంగా జీవించటం ముఖ్యం. విలాసం అవసరం కాదు. ఆ విషయం గుర్తిస్తే, మన పిల్లలు ఆ మాత్రం బ్రతకటం చేతకాని వాళ్ళు కాదు.

స్వాతంత్ర్యం అంటే  కోరుకున్నది చెయ్యగలగటం కాదు. ఏది అవసరమో గుర్తించి అవసరమైనది చెయ్యగలగటం. స్వేచ్ఛ అంటే కోరుకున్నది పొందటం. కానీ అలాంటి స్వేచ్ఛ భవిష్యత్తుకి అవరోధం కానంతవరకు, శృతి మించనంత వరకు, ఇతరులకు ఇబ్బంది కానంతవరకు ఫరవాలేదు.


Comments

Popular posts from this blog

🌿 ఉగాది పండగ - ఎందుకు, ఏమిటి, ఎలా?

  ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు… ఇది కొత్త ఆలోచనలకు, కొత్త ఆశలకు, కొత్త జీవనానికి ప్రారంభం. ఉగాది  - యుగాది అనే పదం నుండి వచ్చింది. “యుగాది” అంటే  “యుగం + ఆది” — అంటే కాలానికి ఆరంభం అని అర్ధం . తెలుగు ప్రజలకు ఇది నూతన సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి ఒక అవకాశం. 🌼 వసంత ఋతువు – ప్రకృతి ఉత్సవం  వసంత ఋతువు ఉగాదితో ప్రారంభమౌతుంది. ప్రకృతి కొత్త జీవితాన్ని అందుకుంటుంది. శరీరానికి, మనసుకు హాయిగా ఉంటుంది. ప్రకృతి సహజంగా జీవ శక్తిని పెంచుతుంది. మామిడి పూలు వేప పువ్వులు పచ్చని చెట్లు ఇది ప్రకృతి మనకు ఇచ్చే ఒక అవకాశం.  ఉపయోగం లేని అలవాట్లు విడిచిపెట్టి జీవితానికి సహకరించే అలవాటులను, అవకాశాలను ఆహ్వానించాలి. 🌸 ఉగాది యొక్క ప్రాముఖ్యత చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సంవత్సర ఆరంభమౌతుందని పంచాంగ శాస్త్రం చెబుతుంది. పురాణాలలో సృష్టి ఆరంభం వసంతంతో మొదలౌతుంది అని చెప్పబడింది. ఆ వసంతం చైత్రమాసం తో మొదలౌతుంది. చైత్రమాసం లో మొదటి రోజునే ‘యుగాది’గా భావించడం సాంప్రదాయంగా ఏర్పడింది.   బ్రహ్మ దేవుడు  ఈ రోజే సృష్టిని ప్రారంభించాడ...

శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు పురుషోత్తముడు అంటారు కదా. ఎందుకంటారు? ఆయనకు తిరుగులేదు అనా? కానే కాదు.  వాళ్ళ పినతల్లి వల్ల అడవుల పాలు ఐనా ఆమె కొడుకుని రాజుగా చేసినా విధిని మాత్రం వినమ్రత తో పాటించాడు. ఎవ్వరినీ పల్లెత్తు మాట అనలేదు. తండ్రి మాట కోసం సుఖంగా ఉన్న జీవితాన్ని త్యాగం చేసి కష్టాల బాట ఎంచుకున్నాడు. తన కర్తవ్యాన్ని పూర్తి శ్రద్ధతో, శక్తి యుక్తులతో నిర్వర్తించాడు. అందులో మనం తెలుసుకోవాల్సిన నిగూఢ రహస్యం ఏమిటంటే కష్టం లేకుండా జీవించడం గొప్ప విషయం కాదు. కష్టాల్లో ఉన్నా కూడా తన సౌమ్య శీలాన్ని, శక్తి యుక్తులను కోల్పోకుండా ఎలా ఉండాలో రాముడు మనకు చూపించాడు.  ఇది సత్యదూరం గా అనిపిస్తుంది మనకి. కానీ నిజం ఏంటంటే మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇది సాధ్యం కాదు అని అనుకుంటాం. ఈ రోజుల్లో మన ఇంటినీ సుఖాన్ని వదిలి వెళ్ళమని ఎవరూ చెప్పట్లేదు కదా! జీవితం లో వచ్చే ఒడిదుడుకులు తట్టుకుని నిలబడే నిబ్బరం ఉండాలి అంతే! ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాడుకొని వదిలేస్తే అది బాధ. కానీ అలా జరగదు అని అనుకోవడం మన అమాయకత్వం. లోకంలో మనం తప్పు చేసినా భరించేది మన తల్లిదండ్రులే. ఇంకెవ్వరూ కనీసం మన కోసం మన కంటే ఎక్కువ ఆలోచించరు. అల...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః | యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః॥ - మను స్మృతి అధ్యాయం 3, శ్లోకం 56 మెదటి చరణం అందరికీ తెలిసిందే. ఆడవారు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. కానీ రెండో చరణం అర్థం మనుస్మృతి లో స్త్రీ కి ఉన్న గౌరవం, ప్రాముఖ్యత ఉటంకిస్తూ ఉంది. యత్రైతాస్తు న పూజ్యంతే = యత్ర + ఇతి + న + అస్తు + పూజ్యంతే = ఎక్కడ ఆమె పూజించబడదో సర్వాస్తత్రాఫలాః క్రియాః = సర్వః + తత్ర + అఫలాః + క్రియాః = అక్కడ ఏ పనీ ఫలించనట్టే. అంటే ఎక్కడ స్త్రీ గౌరవించబడదో అక్కడ ఏమున్నా, ఎంతున్నా నిష్ప్రయోజనం అని. స్త్రీ కి గౌరవం ఇవ్వండి అని చెప్పి ఊరుకోలేదు. ఆమెకు గౌరవం ఇవ్వని చోట ఇంకేమీ విలువైనది కాదు అని తర్కపూర్ణంగా ఉటంకిస్తూ చెప్పారు.  ఇది మన సంస్కృతిలో స్త్రీ యొక్క స్థానం. ముష్కర మూకలు మన మీద దాడి చెయ్యక ముందు కాలంలో స్త్రీకి అన్ని వ్యవహారాలలో అవకాశం, గౌరవం ఉండేది. స్త్రీ తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవటానికి నిర్ణయించుకున్నా, విద్య నుంచి యుద్ధం వరకు ఏ అంశంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నా సమానమైన గౌరవం ఉండేది. వేదాలు వ్రాసిన వారిలో లోపముద్ర వంటి స్త్రీ మూర్త...