తెలుగు భాష ఎంతో మధురమైన భాష. దీనిని "ఇటాలియన్ అఫ్ ద ఈస్ట్" అని పిలుస్తారు. కావ్యానికి అనుకూలంగా చక్కని చందస్సు తెలుగులో ఉంది. తెలుగు రాజులు కూడా తెలుగు వాంగ్మయాన్ని, తెలుగు కవులను చాలా ప్రొత్సహించారు. సమకాలీన కవులు కూడా చాలా మంది ఉన్నారు.
తెలుగు లో చాలా వాంగ్మయం ఉంది. అందులో చాలా పేరు గాంచినవి కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
శ్రీమదాంధ్ర మహా భారతము
నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ అనే ముగ్గురు కవులు మూడు వేరు వేరు కాలాల లో వ్రాసిన సంకలనము ఈ మహా గ్రంధము. ఒకరితో నాకు ఏమి పని అనుకోకుండా ఒకరి తరువాత ఒకరు ఎంతో శ్రమకోర్చి ఈ గ్రంధాన్ని పూర్తి చేశారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అవ్యాజమైన అభిమానానికి ఇది నిదర్శనము.
శ్రీమదాంధ్ర మహా భాగవతము
బమ్మెర పోతన వ్రాసిన ఈ గ్రంధమును రాజులకు అంకితమివ్వ నిరాకరించి కడవరకు పేదరికము అనుభవించారు కానీ ఆయన నమ్మిన సిద్ధాంతము వదులుకోలేదు. ఇది మన తెలుగు చరిత్ర లో నమ్మిన సిద్ధాంతము పట్ల మనకు గల నిబద్ధతను తెలిపే ఉదాహరణ.
ఈ బ్లాగుని తెలుగు భాషకు సంబంధించిన అన్ని విషయాలకు చిరునామా గా చూడాలని నా ఆశ. మీ అభిప్రాయాలను సునాయాసంగా ఇక్కడ పంచుకోగలరు. మీరు అందించే వివరాలు కూడా పరిగణన లోకి తీసుకుని బ్లాగును విస్తరించే ప్రయత్నం చేస్తాము.
Comments
Post a Comment