స్వాతంత్ర్యం! అందరికీ చాలా ఇష్టమైన పదం. ఇంగ్లిష్ లో ఫ్రీడం అనే పదానికి తెలుగు అర్ధం స్వేచ్చ. ఈ రెండు పదాల అర్ధం వేరు. వాటి పర్యవసానం కూడా వేరు. స్వేచ్చ అనే పదానికి అర్ధం స్వ + ఇచ్ఛ = నాకు నచ్చింది చేస్తాను. ఇందులో నిర్ణయం అనేంత ఏమీ లేదు. చాలా సాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించదగ్గ పదం. స్వాతంత్ర్యం అనే పదానికి అర్దం స్వ + తంత్రం = నా నిర్ణయం నేను తీసుకునే శక్తి కలిగి ఉంటాను/ఉన్నాను అని. ఇది నిజంగా మంచిదేనా ? జవాబు - అడిగిన వ్యక్తి పరిణతి పైనా , జవాబు చెప్పే వ్యక్తి బాద్యత / పరిణతి పైనా ఆధారపడుతుంది. మూడు సంవత్సరాల కుర్రవాడు నేను నాకు నచ్చిన తిండి తినటం స్వేచ్చ అంటే ఒక పూటకి ఫరవాలేదు. ప్రతి పూట అలా చేస్తే వాడి ఆరోగ్యం పాడుచేసిన వాళ్ళం అవుతాం కదా. అందుకే అప్పుడప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలి. స్వాతంత్ర్యం ఇవ్వటానికి ముందు వాళ్ళకు పరిణతి కావాలి. తాను ఏ చదువు చడవాలో నిర్ణయించుకునే అవకాశం పిల్లకు ఇవ్వటం స్వాతంత్ర్యం. తన జీవితం పట్ల బాధ్యత ఉన్న విధ్యార్ధికి ఈ స్వాతంత్ర్యం ఎప్పుడూ మేలు చేస్తుంది. చాపల్యం ఇంకా పోకముందు అదే నిర్ణయం వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు...