Skip to main content

Posts

Showing posts from December, 2024

పెళ్లిళ్ళు పెటాకులు ఎందుకు అవుతున్నాయి?

 ముందుగా ఒక మాట. ఇది చదువుతున్నారు అంటే పెళ్లి గురించి తెలుసుకునే ఉద్దేశ్యం మీకు ఉంది అని నేను నమ్ముతున్నాను. మీ పెళ్లి నూరేళ్ళ పంట కావాలని నా ఆకాంక్ష. మీకు పెళ్లి గురించి, అది విఫలమయ్యే కారణాల గురించి సూటిగా నిక్కచ్చిగా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి నా మాటలు సూటిగా ఉంటాయి. ఇది మీకు సమ్మతమయితేనే చదవండి. మీ మనోభావాలకు నేను ఎలాంటి హామీ ఇవ్వబోవటం లేదు. మీరు ఇది చదివినందుకు మీకు పెళ్లి గురించి ఒక చక్కటి అవగాహన ఇవ్వటం నా బాధ్యత గా భావిస్తున్నాను.  మీకు ఏది మంచిదో చెప్పే ఉద్దేశ్యం నాకు లేదు. తల్లిదండ్రులు చెప్పేది వినని జనరేషన్ కి నేను చెప్పేది ఎక్కుతుంది అని నేను అపోహ పడను. అలా అని మీరు చెడ్డవారు అని కూడా నేను అనుకోను. మీ పరిస్థితులు మీవి. మీ ఆశలు మీవి. మీ జీవితం మీ ఇష్టం. మీ మంచి కోరుతున్నాను కాబట్టి మీరు పెళ్ళికి ముందు ఆలోచించుకోవటానికి ఈ బ్లాగ్ ఒక మంచి సాధనం అయితే చాలు అని ఆశిస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తాను.  పెళ్లి అంటే అందరికీ ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆకాంక్షలు. నా పెళ్ళాం ఇలా ఉండాలి, నా మొగుడు అలా ఉండాలి అని. నూరేళ్ళ పంటకు నాంది పెళ్లి. అలాంటి పెళ్లి పెట...

చక్కని వివాహానికి చిక్కని చిట్కాలు

వెయ్యి అబద్ధాలు ఆడి ఐనా ఒక పెళ్లి చెయ్యాలి అని ఒక పాత నానుడి. ఇది నిజంగా మంచి చేస్తుందా? అసలు ఈ ఆలోచన మంచిదేనా? పెళ్లి చెయ్యటం ఎంతో గొప్ప పనిగా భావిస్తాం. ఇది సమంజసం కావచ్చు. కానీ పెళ్లిళ్లు చెయ్యటానికి అబద్ధాలు చెప్పకూడదండీ. మీరు చెప్పిన అబద్ధాలు వాళ్ళ జీవితాలకు అవరోధం కావు అని మీరు భరోసా ఇవ్వగలరా? అబద్ధాల మీద ఆధారపడి కొత్త జీవితం ప్రారంభించే వారికి అది ఎంత పెద్ద అవరోధంగా మారుతుందో మీరు ఊహించగలరా? ఈ పోటీ ప్రపంచంలో ఎంత శ్రమ ఉందో మీకు తెలుసా? ఆ శ్రమకు మీరు ఆడిన అబద్ధాలు ఇంకెంత ఇబ్బందిని జోడిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకప్పటిలో కుటుంబం చేసే వృత్తి పని చేసుకుంటూ ఇంటిలో అందరూ ఒక తీరుగా బ్రతికే వారు. ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళు అందరూ ఒకేలా ఉండకపోయినా సుమారు ఒకలా ఆలోచించేవాళ్ళు. కనీసం ఒకరి ఆలోచనలు ఒకరికి అర్ధం అయ్యేవి. వారి సామాజిక, ఆర్ధిక పరిణతి బట్టి వాళ్ళ జీవనం సాగించేవాళ్ళు. మానసికంగా బాగా పరిణతి సాధిస్తే ఇంకొంత మెరుగైన జీవితం పొందేవాళ్ళు. దీనికి భిన్నంగా కొన్ని ఉదాహరణలు లేకపోలేదు. కానీ ఎక్కువమంది వారి జీవితాన్ని మనోనిగ్రహంతో సాగించలేరు. వారి చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రకారం మారుతారు. వా...

ఆడపిల్ల అంటే అంగడి సరుకు కాదు

  ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చూసాను. అది నాకు చాలా బాధ కలిగించింది. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ముందు తన తల్లిదండ్రులకి ఒక లెటర్ వ్రాసింది. ఆ లెటర్ సారాంశం ఇలా వుంది.   అమ్మా , నాన్నా , నేను ఒక అబ్బాయి ప్రేమలో మోసపోయాను. వాడు నన్ను అనుభవిస్తూ నాకు తెలియకుండా వీడియో తీసి నన్ను బెదిరించి వాడి స్నేహితులందరితో నన్ను అనుభవింపజేసి నన్ను మానసికంగా శారీరకంగా చిత్రవధ చేసాడు. నా ఒళ్ళంతా నొప్పిగా ఉంది. నా మనసు అవమానంతో కుంగిపొయింది . భరించ లేక చనిపొతున్నా. నన్ను క్షమించండి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీ బిడ్డ గానే పుట్టి మిమ్మల్ని బాగా చూసుకుంటాను.   ఇది చదివినప్పుడు మొట్టమొదట చాలా బాధ కలిగింది. వాడసలు మనిషేనా అనిపించింది. నమ్మిన ఆడపిల్లని గుండెల్లో దాచుకోవాల్సింది ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా ? వాడే నా చేతికి దొరికితే వాడిని ముక్కలు కొట్టి కుక్కలకి వెయ్యాలనిపించింది. ఇలాంటి పనులు ఎలా చేస్తారు అని ఆలోచించాను. చెడు సావాసం వల్ల కావచ్చు , తల్లిదండ్రుల పెంపకం బాగాలేక కావచ్చు , ఇంకేదైన ఇతర కారణం కావచ్చు అనిపించింది. కానీ ఎవరో చేసిన తప్పుకి ఒక ఆడ పిల్ల బలి కావాల్సిందేనా అనిపించింది. ...

స్వాతంత్ర్యం అంటే ఏమిటి?

స్వాతంత్ర్యం! అందరికీ చాలా ఇష్టమైన పదం. ఇంగ్లిష్ లో ఫ్రీడం అనే పదానికి తెలుగు అర్ధం స్వేచ్చ. ఈ రెండు పదాల అర్ధం వేరు. వాటి పర్యవసానం కూడా వేరు.   స్వేచ్చ అనే పదానికి అర్ధం స్వ + ఇచ్ఛ = నాకు నచ్చింది చేస్తాను. ఇందులో నిర్ణయం అనేంత ఏమీ లేదు. చాలా సాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించదగ్గ పదం.   స్వాతంత్ర్యం అనే పదానికి అర్దం స్వ + తంత్రం = నా నిర్ణయం నేను తీసుకునే శక్తి కలిగి ఉంటాను/ఉన్నాను అని. ఇది నిజంగా మంచిదేనా ? జవాబు - అడిగిన వ్యక్తి పరిణతి పైనా , జవాబు చెప్పే వ్యక్తి బాద్యత / పరిణతి పైనా ఆధారపడుతుంది. మూడు సంవత్సరాల కుర్రవాడు నేను నాకు నచ్చిన తిండి తినటం స్వేచ్చ అంటే ఒక పూటకి ఫరవాలేదు. ప్రతి పూట అలా చేస్తే వాడి ఆరోగ్యం పాడుచేసిన వాళ్ళం అవుతాం కదా. అందుకే అప్పుడప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలి. స్వాతంత్ర్యం ఇవ్వటానికి ముందు వాళ్ళకు పరిణతి కావాలి.   తాను ఏ చదువు చడవాలో నిర్ణయించుకునే అవకాశం పిల్లకు ఇవ్వటం  స్వాతంత్ర్యం. తన జీవితం పట్ల బాధ్యత ఉన్న విధ్యార్ధికి ఈ స్వాతంత్ర్యం ఎప్పుడూ మేలు చేస్తుంది. చాపల్యం ఇంకా పోకముందు అదే నిర్ణయం వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు...

మట్టి వాసన తెలుగు

  మట్టి వాసన   తెలుగు .. మరుమల్లె సువాసన   తెలుగు ... నందమూరి నటన  తెలుగు .. ఘoటసాల గొంతు  తెలుగు  .. ఎలా వుంది..??   నీ తేట  తెలుగు  కవిత్వం చూసి.. ఏదో తెలియని ఆనందం వేసి.. నా మనసులో నిన్ను పొగిడేసి.. రాస్తున్నా తిరుగు టపా .. ప్రేమ సిరా లో ముంచేసి..   ఇంత చెత్త కవిత్వం వుండధనేసి.. నువ్వనుకోకు..నవ్వుకోకు..దయచేసి .. ప్రేమతో రాస్తున్నా ..కనుక.,తప్పులుంటే మన్నిన్చేసి ... నీ శిష్యుడుగా చేర్చుకో.. కరునించేసి.. :)))   చాలా చాలా ప్రేమతో, మీ.. రాజా పోలిశెట్టి

నా మెయిలు లో తెలుగు వెలిగిపోతుంటేను

  నా మెయిలు లో   తెలుగు   వెలిగిపోతుంటేను... తెలుగు   వెలుగు లు దిగంతాలు దాటేను ...   నా కలలు నిక్కముగ చూసుకుంటున్నా... తెలుగు  తల్లి పదముల మొక్కి, బాసలు చేసుకుంటున్నా..   తెలుగు  లో ఈ మెయిలు వ్రాసుకుంటున్నా....   లాలి పాటల  తెలుగు        పొలము పాటల  తెలుగు చదువు సంధ్యల  తెలుగు        శౌర్య చేతన  తెలుగు మదికి సాంత్వన  తెలుగు        మధుర లాలన  తెలుగు మరులు గొల్పెడు  తెలుగు      మమత  తెలుగు రత్నాలు పొదిగిన  తెలుగు  రాచ  తెలుగు కృష్ణ రాయల కీర్తి గాంచె  తెలుగు రవి చెందురుల ఆయువున్న  తెలుగు కవి త్రయము కూర్చిన భారతము  తెలుగు అన్నమాచార్యుని పదము  తెలుగు త్యాగరాయుని కృతుల సిరులు  తెలుగు పోతన్న భాగవతము కాంచిన  వెలుగు శ్రీనాధ ప్రబంధముల మెరిసె జిలుగు కీర్తించ లేనంత వరము  తెలుగు మాటే తానైన...

తెలుగు పండుగలు - సంస్కృతి, సంప్రదాయాల కాంతులు

తెలుగు భాషాభిమానులకు తెలుగు పండుగలు ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగినవి. ఇవి కేవలం ఉత్సవాలుగానే కాక , తెలుగు ప్రజల జీవనశైలిలోని ఆనందాన్ని , అనుబంధాలను, జీవితం పట్ల సానుకూల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు పండుగలు ప్రకృతిని , కుటుంబ బంధాలను,   ఆధ్యాత్మిక ప్రగతిని గౌరవించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి.   1. సంక్రాంతి ఈ పండగని మకర సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగ. ఇది రైతులకు పంట చేతికి వచ్చే సమయం. ప్రకృతిని , రైతులను గౌరవించడానికై జరుపుకునే పండుగ. పూర్వీకులను గుర్తు చేసుకుని వారికి కృతజ్ణతలు తెలుపుకునే సాంప్రదాయం కూడా ఉంది.  సంక్రాంతి సమయానికి రైతులు పంటను ఇంటికి చేర్చి కూలీలకు వారి కష్టానికి ప్రతిఫలం ఇస్తారు.  దాదాపు నాలుగు నెలల శ్రమకు ఫలితం దక్కుతుంది. సమాజంలో అన్ని వర్గాల వారికి వ్యవసాయంతో ఏదో ఒక రకమైన సంబంధం ఉంటుంది. కూటికోసం కోటి విద్యలు అనే సామెతను వినే ఉంటారు. ఆ కూడు ఇంటికి చేరే సమయం ఈ మకర సంక్రాంతి. అందరి ఇళ్లల్లో సంక్రాంతి సంతోషాలు నింపుతుంది కనుక దీన్ని పెద్ద పండుగ అంటారు. ఈ పండగ ముందు , వెనుక కూడా కొన్ని పండగలు వరుసగా ఉ...